2 తిమోతి 3 వ అధ్యాయము.
2 తిమోతి 3:1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము.
3వ అధ్యాయములో, పౌలు యొక్క దృష్టి తిమోతికి సూచనలు ఇవ్వడం నుండి అబద్ద బోధకుల వైపుకు మళ్లింది.
''అయితే ఈ విషయాలు తెలుసుకొనుము'' - లేక నేను ఏమి చెప్తున్నానో వాటిని గూర్చి ఒక అవగాహన కలిగియుండుము అని అర్ధం. ''అయితే'' అనే పదము 2:23-26 వరకు వున్న వచనాలలో చెప్పబడిన దానికి తేడాను చూపిస్తుంది.
పౌలు ఎందుకు ఈ విషయాలను తిమోతికి చెప్తున్నాడు? ఎందుకంటే ''అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును.'' ఈ విషయాన్నీ చెప్పటం ద్వారా, పౌలు అంత్యదినముల కోణాన్ని పరిచయము చేస్తున్నాడు. - అపాయకరమైన కాలములు వచ్చును - యూదులు యొక్క ప్రత్యక్షత అంశాలలో ఇది సాధారణమైనది. (దానియేలు 12:1 ''ఈ కాలము వరకు ఎన్నటికిని కలగనంత ఆపద కలుగును'' 1 హనోకు 80:2-8, 100:1-3, మోషే యొక్క అంచనాలు 8:1, 4 ఎజ్రా 5:1-12, 2 బారూకు 25-27, 48:32-36 ; 70:2-8).
''అపాయకరమైన కాలములు వచ్చును''- అపాయకరమైన కాలములు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇది భవిష్యత్ మధ్య సూచిక క్రియ అనే వ్యాకరణములో వాడబడింది. (గ్రీకులో ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది). కాబట్టి, సందేహానికి పౌలు ఎటువంటి తావు ఇవ్వలేదు. అపాయకరమైన కాలములు వస్తాయి.
అయితే, సమయము ఎప్పుడు? అపాయకరమైన కాలములు ఎప్పుడు వస్తాయి? అంత్య దినములు అనగా అర్ధం ఏమిటి ? 1 యోహాను 2:18వ వచనాన్ని ఒకసారి గమనించండి. అక్కడ యోహాను ఇలా చెప్తాడు, ''చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలిసికొందురు.''
కడవరి ఘడియ వచ్చినదని యోహాను ఇక్కడ చెప్తున్నాడు. ''ఇది కడవరి ఘడియ.'' ఈ వాక్యంలో ఒక వ్యక్తి గమనించదగినది ఏమనగా ఖచ్చితత్వం. 2 తిమోతి :1 లో పౌలు చెప్తున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును.
ఒకవేళ పౌలు 2 తిమోతి పత్రికను సుమారుగా క్రీ. శ 64-67 మధ్య కాలములో వ్రాసి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్న ఈ మాటను చెప్తే, యోహాను తన పత్రికను క్రీ. శ 90 లో వ్రాసినప్పుడు, ఇది కడవరి ఘడియ అని చెప్పాడు.
దీనిని బట్టి అంత్య దినములు ప్రారంభించబడ్డాయి అని చెప్పవచ్చును. కాబట్టి, మనం చివరి దినములలో ఉంటే 3:2 5 లో చెప్పబడిన జాబితా ఎందుకు చురుకుగా లేదు అని ఒకరు అనవచ్చు. కాబట్టి పౌలు ఈ క్రూరమైన వైఖరి గురించి ఇంకా సరైన దృక్పధం ఇవ్వలేదా? లేదు, అతడు ఇంకా ఇవ్వలేదు అనే చెప్పాలి.
అయితే, అంత్య కాలముల సమయము ఎప్పుడు? ''అంత్య దినములు" అనే పదము యుగ సమాప్తికి లేక కీస్తు యొక్క రెండవ రాకడకు సంబందించినది కాదు. ఈ పదము క్రీస్తు యొక్క విమోచన కార్యము మొదలుకొని తిరిగి ఆయన వచ్చే సమయము వరకు సూచిస్తుంది. క్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము అంత్యదినములను ప్రారంభించాయి.
Gordon Fee ఈ రీతిగా వివరిస్తాడు: '' క్రీస్తు యొక్క రాకతో, క్రొత్త యుగము, అంత్యదినముల యొక్క వాస్తవికత ప్రారంభించబడినవి.
NIGTC ఈ రీతిగా చెప్తుంది: అంత్య దినములు అనే పదము రాబోయే రోజులను సూచించటం లేదు గాని, క్రైస్తవ సమాజం అంత్య దినములలో వుంది అని పౌలు తిమోతికి జ్ఞాపకము చేస్తున్నాడు. మరియు అది వాస్తవము ఎందుకంటే, అతడు ఆ రోజుల్లో వుండే లక్షణాలను వర్ణించాడు.
ఇవన్నీ ఏమి చెప్తున్నాయి? అంత్య దినములు ప్రారంభమయ్యాయి - మనము అంత్య దినములలో వున్నాము. అయితే 2-5 వచనాలలో వున్నా జాబితా ఎందుకు వాస్తవ రూపం దాల్చటం లేదు? అవి ముందుగానే వున్నాయి. 21 వ శతబ్దానికి ఇవి క్రొత్త కాదు. అవి చాల కాలం ముందు నుండి అభ్యాసము చేయబడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వ్యతిరేక ధోరణి ప్రజలలో విస్తరిస్తుండడం గమనించవచ్చు.
2 తిమోతి 3:2-5 ఏలాగనగా మనుష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారివలె యుండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు, ఇట్టివారికి విముఖుడవై యుండుము.
అంత్య దినములలో ''మనుష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె యుండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.''
1వ వచనంలో చెప్పబడిన అంత్య దినములను గూర్చి ''ఏలాగనగా'' అనే పదముతో విస్తరింపచేసి మాట్లాడుతున్నాడు.
అంత్యదినములను వివరించే క్రమములో, 18 రకముల జాబితాను ఇచ్చాడు (ఇవన్నీ వ్యక్తిగత వివరణ). ఈ జాబితాలో వున్నా ఎక్కువ మంది ''మనుష్యులు స్వార్ధ ప్రియులు'' అనే వర్గానికి అనుసంధానించబడి వున్నారు. ఒకవిధముగా చెప్పాలంటే ఇక్కడనుండి మిగతా జాబితా కొనసాగుతుంది. నిజానికి చెప్పాలంటే, ఒక వ్యక్తి స్వార్ధపరుడుగా వున్నట్లైతే అతడు మిగతా దేనిని గూర్చి ఆలోచించడు.
''దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు'' - దేవునికంటే సుఖమును ఎక్కువగా ప్రేమించే ప్రజలు అంత్యదినములలో ఎక్కువగా వుంటారు. ఎందుకు? ఎందుకంటే భక్తి జీవితమునకు వారి జీవన విధానము అడ్డంకిగా ఉంటుంది. తమను తాము ప్రేమించుకునేవారికి దేవుణ్ణి ప్రేమించడం చాల కష్టముగా ఉంటుంది. అయినప్పటికీ వారు భక్తిని కలిగి వున్నట్టుగా కనపడతారు కాని దాని శక్తిని ఆశ్రయించరు. ఇటువంటి ప్రజలు నేటి క్రైస్తవ్యములో లేరా?
Gordon Fee ఎం చెప్తున్నాడో వినండి:
వారు బహిరంగ వ్యక్తీకరణలు, సన్యాసి పద్ధతులు మరియు అంతులేని మతపరమయిన చర్చలు కలిగి వుంటారు. తమకు తామే నీతిమంతులమని అనుకుంటారు ఎందుకంటే వారు నిజానికి భక్తి కలిగిన వారుగా వుంటారు. కానీ వారు క్రైస్తవ జీవితానికి అవసరమైన శక్తిని ఆశ్రయించరు. ఎందుకంటే వారు భక్తికి అతీతముగా వున్నా పనులను చేస్తుంటారు మరియు లోకస్తుల వలె అన్య సంప్రదాయాలను కలిగి వుంటారు.
2 తిమోతి 3:6-7 పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో చొచ్చి, వారిని చెర పట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు.
''ఇండ్లలో చొచ్చి, వారిని చెర పట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు'' - ఎవరి గురించి పౌలు మాట్లాడుతున్నాడు? పౌలు అబద్ద బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబద్ద బోధకులు పౌలు చెప్పిన జాబితాలో భాగముగా వున్నారు. వారు వారి ఇండ్లలోనికి చొరబడుతున్నారు. - వారు వంచన మార్గాల ద్వారా లేదా ఎదో ఒక నెపముతో వారి ప్రాంతములోనికి, లేదా ఇండ్లలోకి ప్రవేశిస్తుంటారు (BDAG, 333).
అవివేక స్త్రీలను చెరపట్టే ఉద్దేశముతో వారు ఈ విధముగా చొరబడుతుంటారు (సరిగా అర్ధం చేసుకోవాలంటే, వారిని నియంత్రణలోనికి తెచ్చుకునే ఉద్దేశముతో, వారిని చెరగా పట్టుకొనుటకు, BDAG, 31). అవివేక స్త్రీలు అనగా కాలీగా ఉండేవారు, బలహీనులు లేక జ్ఞానము లేనివారు, BDAG, 208, ప్రత్యేకించి, పాపము చేత ఎవరైతే పట్టబడి వున్నారో మరియు తప్పిపోయిన వారుగా వున్నారో అటువంటి స్త్రీలు - ఇటువంటి స్త్రీలు పాపములు (బహువచనం) అనే భారముతో నింపబడి తప్పుడు విధానములో నడిపించబడేవారుగా వున్నారని లేక ఉద్దేశపూర్వకంగా వివిధమైన కోరికలచేత తప్పుడు మార్గములో నడిపించబడ్డారని చెప్పబడింది.
లేఖనము ఏమి చెప్తుందో ఒకసారి గమనించండి - అవివేక స్త్రీలు ''పాపభరితులై నానావిధములైన దురాశవలన నడిపింపబడుచున్నారు' '- ఇక్కడ చెప్పబడుతున్న అంశం ఏమనగా, స్త్రీలు (గ్రీకు భాషలో పరిపక్వత లేని ప్రవర్తన కలిగినవారు అని చెప్పబడింది) గతములో పాపముల చేత నింపబడి వున్నారు (గతములో), అయినప్పటికీ, వారు నిరంతరంగా వివిధమైన కోరికలచేత దారి తప్పిపోతున్నారు.
కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఇటువంటి స్త్రీలు, ''ఎల్లపుడు నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని వారు'' - అబద్ద బోధకుల చేత పట్టబడినపుడు, లేఖనము చెప్తుంది వారు ఎదో ఒక దానిని బోధిస్తున్నారు, మరియు స్త్రీలు ఎదో ఒక దానిని నేర్చుకుంటున్నారు. అయినప్పటికి, వారు సత్యవిషయమైన అనుబజ్ఞానము పొందుకోలేని వారుగా వున్నారు- వారు సత్యాన్ని గ్రహించరు.
ఎందుకు అలా? ఎందుకంటే, అబద్ద బోధకులు మరియు స్త్రీలు ఒకరిని ఒకరు పోషించుకున్నారు.
స్త్రీలు ''మతపరమైన అభ్యాసాన్ని'' పొందుకున్నారు. - చెడ్డ విధానము, వారి యొక్క ఆసక్తిని పోషించుకొనుటకు తప్ప సువార్త యొక్క స్వాతంత్య్రంలోనికి తీసుకు వచ్చే ఉద్దేశము కాదు - మరియు వారు అబద్దబోధకులకు అనుగుణముగా మళ్లిపోతారు (1 తిమోతి 6:3-10). ఇందుచేతనే స్త్రీలు బోధించకూడదని పౌలు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. వారు వారి యొక్క భర్తలకు లోబడే వారుగా ఉండాలని (1 తిమోతి 2:9-15), మరియు యవ్వనులైన విధవరాండ్రు సుఖభోగములయందు ప్రవర్తించక (5:6), నిందించుటకు విరోధికి అవకాశమివ్వకుండా వివాహము చేసుకోవాలని పౌలు హెచ్చరించాడు (5:14). ఎందుకంటే కొంతమంది ఇంతకుముందే త్రోవనుండి తొలగిపోయి సాతానును వెంబడించారు (5:15).
2 తిమోతి 3:8 యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
''యన్నే, మరియు యంబ్రే ఎదిరించినట్టుగా'' (నిర్గమ 7:11-12, 22, 8:7). యన్నే, యంబ్రే అనువారు మోషేకు విరోధముగా గారడీ చేయడానికి నిలువబడిన శకునగాండ్రు. వారివలెనే అనే మాట సారూప్యతను సూచిస్తుంది.
యన్నే, యంబ్రే అనువారు:
వీరిద్దరి పేర్లు నిర్గమకాండములో ప్రస్తావించబడలేదు, అయితే క్రీ .పూ మొదటి శతాబ్దపు యూదుల రబ్బీలా రచనలలో మరియు రెండవ దేవాలము అనే రచనలలో వీరు మోషే విరోధులు అని ప్రస్తావించబడింది. (4Q డమాస్కస్ డాక్యుమెంట్ [4Q266] fr .3 , 2:13-15 = CD 5:17-19) మరియు క్రైస్తవులు, మరియు ఇతర అన్యుల రచనలలో కూడా పేర్కొనబడింది. 1 మరియు 3వ మధ్య వున్న క్రైస్తవ రచనల ఆధారముగ యన్నే, యంబ్రే వున్నప్పటికి క్రైస్తవ్యానికి ముందు వున్న సంప్రదాయాల, ఆధారాలు మాత్రమే మిగిలి వున్నాయి.
కాబట్టి అదే విధానములో, అబద్ద బోధకులు సత్యాన్ని తిరస్కరిస్తారు, వారు సత్యాన్ని ఎదిరిస్తారు.
''వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులుగా వున్నారు'' - చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులుగా వున్నారు అని ఎవరిని గూర్చి పౌలు చెప్తున్నాడు? అబద్ద బోధకులను గూర్చి చెప్తున్నాడు.
2 తిమోతి 3:9 అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో అలాగే వీరిదికూడా అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.
''వీరు ఇక ముందుకు సాగరు'' - వీరు ఇంకా ముందుకు సాగరు అనేది భవిష్యత్ కాలములో వ్రాయబడిన క్రియ. ''కచ్చితత్వాన్ని'' సూచిస్తుంది. వారు ముందుకు సాగరు. ఎందుచేత? ఎందుకంటే ''వారి యొక్క అవివేకము అందరికి తేటపడును'' దీని యొక్క వారి యొక్క మోసపు క్రియలు ఆగిపోతాయి అని కాదు కానీ వారు తేటపరచబడతారు. సత్యము విజయము పొందుతాది.
''యన్నే, యంబ్రే యొక్క అవివేకము వలెనె'' - అబద్ద బోధకులకు మరియు యన్నే, యంబ్రే లకు మధ్య వున్న పోలిక.
2 తిమోతి 3:10-11 అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతియొకయ ఈకొనియా లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను
పౌలు తిమోతిని హెచ్చరించటం కొనసాగిస్తున్నాడు. ''అయితే'' అనే పదము ఇంతకూ ముందు చెప్పబడిన దానికి వ్యత్యాసమును సూచిస్తుంది. అయితే నీవు - (నీవు అనే పదము ప్రాముఖ్యము), తిమోతి నా బోధను అనుసరించాడు (ఆరోగ్యకరమైన బోధ), ప్రవర్తనను అనుసరించాడు (వ్యకిగత ప్రవర్తన లేక జీవన విధానము), ఉద్దేశమును అనుసరించాడు (సువార్తను ప్రకటించాలనే పౌలు యొక్క కోరిక), విశ్వాసాన్ని అనుసరించాడు (దేవునియందు), దీర్ఘశాంతమును అనుసరించాడు (ఇతరుల పట్ల మరియు క్లిష్ట పరిస్థితిలో), ప్రేమను అనుసరించాడు (దేవుని పట్ల మరియు అందరి పట్ల వున్న ప్రేమ, ఇది లేకపోతె దేవుని గూర్చి ఇతరులకు ప్రకటించేవాడు కాదు లేక మాట్లాడే వాడు కాదు మరియు సువార్తను ప్రకటించమని తిమోతిని ఒత్తిడి చేసే వాడు కాదు). ఓర్పును అనుసరించాడు (సువార్త నిమిత్తము చివరి వరకు శ్రమపడుట), సహనమును అనుసరించాడు (ఇతరుల పట్ల మరియు క్లిష్ట పరిస్థితిలో) ''అంతియొకయలో నాకు కలిగిన ఉపద్రవములను తెలిసికొనినవాడవై వెంబడించితివి.'' ఈ మాట చెప్పుట ద్వారా, ప్రారంభము నుండి జరిగిన వాటిని పౌలు వివరిస్తున్నాడు.'' పౌలు చెప్పే విధానము ఇలా వుంది, చూడు, నేను లుస్త్రలో రాళ్లతో కొట్టబడినపుడు నీవు అక్కడ వున్నావు. నీవు క్రైస్తవ నడవడిక ప్రారంభించిన నాటి నుండి నీవు చూసిన వాటిని జ్ఞాపకము చేసుకో. కాబట్టి ప్రస్తుతం నీకు కలుగుతున్న శ్రమలలోను మరియు రాబోయే శ్రమలలోను నీవు మధ్యలో విడిచిపెట్టి రాకు.''
''అట్టి హింసలను సహించితిని, కాని వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను'' - ఈ వాక్యము ప్రభువు నందు వున్న భద్రతా మరియు నిశ్చయతను సూచిస్తుంది. ఏమి జరిగినప్పటికీ కూడా అన్నిటిలోనుండి ఎల్లపుడు ప్రభువు పౌలును తప్పించాడు.
2 తిమోతి 3:12 క్రీస్తుయేసునందు సద్బక్తితో బ్రతుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.
ఈ వచనంలో, భక్తిగా జీవించాలి అనే కోరిక కలిగినవారందరు హింస పొందుతారు అనే వాస్తవమును పౌలు దృఢపరుస్తున్నాడు.
ఆంగ్లములో ''నిజానికి'' అనే పదము వుంది. నిజానికి అనే పదమును మరియు అనే పదము తో కూడా చెప్పవచ్చును. ఇది ఈ విధముగా చెప్తుంది, పౌలు హింసలగుండా ఏ రీతిగా అయితే వెళ్ళాడో అలాగే క్రీస్తు నందు భక్తితో బ్రతికే వారికి కూడా హింస వుంటాది. - సద్బక్తితో జీవించడం అనేది క్రీస్తు ద్వారా ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత అతని జీవితములో కృప తీసుకు వచ్చే జీవన విధానము (తీతు 2:11-12), క్రీస్తునందు సద్బక్తి కలిగినవారందరు హింసపొందుతారు.
సాధారణ కోణములో, అందరు అనే పదమును పౌలు ఉపయోగించుట ద్వారా నిజమైన క్రైస్తవులందరిని సూచిస్తున్నాడు.
2 తిమోతి 3:13 అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.
మరొక ప్రక్క, సద్బక్తి కలిగిన వారు హింసపొందుతుంటే, దుర్జనులు మరియు వంచకులు చెడిపోతారు- వారు సాధారణమైన చెడుతనమును నుండి ఘోరమైన చెడుతనమునకు మారిపోవుదురు (దుర్మార్గమైన ప్రజల వలె).
వారి యొక్క వ్యక్తిత్వము వారు ఇతరులను మోసపరచుచు వారు కూడా మోసపోయేవారిగా చెప్పబడింది.
మరొక ప్రక్క, హింస పొందుతున్న వారు వారు కాస్త కాలములో వున్నాము అని ఆలోచిస్తారు అయితే ఈ విషయాలు చెప్పుట ద్వారా వారు క్రీసునందు భద్రపరచబడ్డారని వారి మనసులను పౌలు ధైర్యపరుస్తున్నాడు.
2 తిమోతి 3:14-15 క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యమునుండి నీవెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి ఎవరివలన నేర్చుకుంటివో, ఆ సంగతి తెలిసికొని వాటి యందు నిలకడగా ఉండుము.
''నీవు నేర్చుకుని రూఢియని తెలుసుకున్న వాటియందు నిలకడగా ఉండుము'' - తాను ఏమైతే నేర్చుకున్నాడో మరియు దేనియందు విశ్వసించాడో వాటియందు నమ్మకత్వము కలిగి ఉండాలని మరోసారి తిమోతి కోరబడుతున్నాడు (10-11 వచనాలు ఒకసారి చూడండి).
''ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలిసికొనుము'' - బహుశా పౌలును, తిమోతి యొక్క తల్లి మరియు అవ్వను సూచిస్తుంది.
తన తల్లి నుండి మరియు తన అవ్వ నుండి నేర్చుకున్నాడు అనే విషయము ఈ మాట ద్వారా బలపడుతుంది: ''పరిశుద్ధ లేఖనములను బాల్యమునుండి నీవెరుగుదువు.'' తిమోతి లేఖనము పట్ల అవగాహన కలిగి వున్నాడు.
''పరిశుద్ధ లేఖనములను నీవెరుగుదువు'' అని చెప్పుట ద్వారా, అబద్ద బోధకులతో వున్న తేడాను పౌలు తెలియచేస్తున్నాడు. వారు వారికి లేఖనము తెలుసు అనుకుంటారు కానీ వారికి తెలియదు. కాని తిమోతికి తెలుసు.
అదనంగా, తిమోతి కేవలం బోధకులను ఎరిగియుండటం మాత్రమే కాదు కాని అతనికి బోధల యొక్క మూలం కూడా తెలుసు - పరిశుద్ధ లేఖనములు (NIGTC, 443).
''క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు'' తరువాత, ఈ పరిశుద్ధ లేఖనములు, క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించే శక్తి కలిగినవి. అదేమనగా లేఖనములు ''అంతర్లీన శక్తి కలిగినవి'' (NIGTC, 443), రక్షణ గూర్చిన జ్ఞానము కలిగించుటకు (పాపము అనే బానిసత్వము నుండి విడుదల ఇచ్చుటకు), ఆ జ్ఞానము విశ్వాసము ద్వారా, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు నుండి పొందుకొనుటకు లేఖనములు శక్తి కలిగినవి.
2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్దపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమునై యున్నవి.
పౌలు పరిశుద్ధ లేఖనములను గూర్చి మాట్లాడుతున్నాడు. అవి రక్షణ జ్ఞానము కలిగిస్తాయి (16వ వచనము). అతడు ఇలా చెప్తున్నాడు, ''దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయటకును ప్రయోజనకరమునై యున్నవి.''
దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని చెప్పుట ద్వారా - లేఖనములు దేవుని నుండి వచ్చాయి అని పౌలు సూచిస్తున్నాడు.
కొంత మంది ఈ రీతిగా వాదిస్తారు, ''ప్రతి'' లేఖనము దేవుని ఉపిరినుండి కలిగినది; లేక దేవుని ఊపిరి వలన కలిగిన ప్రతి లేఖనము కూడా ప్రయోజనకరమునై యున్నది (ASV, GNB (Gordon Fee, 279)).
ఒకవేళ ఇది నిజమైతే, పౌలు, లేఖనములు అని చెప్పి వుండే వాడు కాదు. లేఖనములు (బహువచనం) రక్షణ జ్ఞానమును కలిగించుటకు శక్తి కలిగినవి. లేఖనముల ద్వారా (15 వ వచనము), పౌలు సమూహముగా కలిపి చెప్తున్నాడు.
లేఖనములు. మరియు లేఖనములు దైవావేశము వలన కలిగినవి అని చెప్పుట ద్వారా, తాను 15వ వచనంలో ఏమైతే చెప్పాడో, దానిని ప్రాముఖ్యముగా పౌలు తెలియచేస్తున్నాడు. - ''క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు.''
లేఖనముల యొక్క దైవావేశమునకు తోడుగా, పరిచర్యలో వాటి యొక్క ఉపయోగాన్ని పౌలు తెలియచేస్తున్నాడు.
అవి (లేఖనములు) ''ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై యున్నవి.''
ఉపదేశించుటకు - తిమోతి యొక్క ప్రాథమిక బాధ్యత (1 తిమోతి 4:6, 13, 16, 6:3).
ఖండించుటకు - లేఖనములను ఎవరైతే తప్పుగా ఉపయోగిస్తున్నారో వారిని ఖండించాలి.
తప్పు దిద్దుటకును - నైతిక పరమైన గద్దింపు యొక్క ప్రాముఖ్యత - ఏది మంచి ఏది చెడు అని.
నీతియందు శిక్ష చేయుటకు - నీతి ప్రవర్తనను ఒక వ్యక్తిలో పుట్టించటానికి చేసే అభ్యాసము.
16వ వచనము ద్వారా, రెండు విషయాలను గూర్చి పౌలు తిమోతికి సూచనలు ఇస్తున్నాడు.
(1). లేఖనము, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము.
మరియు (2) సత్యమును బోధించుటకు లేక సువార్తను బోధించుటకును మరియు దానిని దుర్వినియోగపరిచే వారిని ఖండించుటకు ప్రయోజనకరమునై యున్నవి.
ఆఖరి 17వ వచనంలో, పౌలు ఉద్దేశాన్ని మరియు ఫలితాన్ని తెలియచేస్తున్నాడు- ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్దపడి ఉండాలి.''
ఈ వచనము యొక్క ఉద్దేశము దైవజనుడు (ఏక వచనము) లేఖనముల చేత తర్భీదు నొందినట్లైతే అతడు పరిపూర్ణముగా కోర్బిన ప్రతి వాటిని నెరవేర్చగలడు (BDAG, 136), మరియు సన్నద్ధుడుగా ఉండగలడు (పరిచర్యకొరకు సిద్దపడుట), ప్రతి సత్కార్యమునకు సిద్దపడగలడు - క్రైస్తవ జీవితములో వున్న ప్రతి కోణము మరియు ప్రతి ఉద్దేశము మరియు తిమోతి విషయములో, క్రెస్తవ పరిచర్య అంతా.
ఈ వచనము ద్వారా, 1:6 వచనంలో తాను చెప్పిన వాదనను ముగిస్తున్నాడు.
Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.