April 9

0 comments

2 Timothy Chapter 1

By Dr. Joel Madasu

April 9, 2020

#bsn.bibleprabodhalu, 2 Timothy, 2 తిమోతి, New Testament

2 తిమోతి మొదటి అధ్యాయము.

ఉపోద్గాగతము: 

2 తిమోతి 4 : 6 - 8 ఇలా చెప్తుంది, 

6. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. 

7. మంచి పోరాటం పోరాడితిని , నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. 

8. ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిఅయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. 

6వ వచనము నుండి, ఈ పత్రికను పౌలు తన  చివరి దినాలలో రాసాడు అని స్పస్టమవుతున్నది, ''నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది.'' 

కేవలం చివరి దినాలలో మాత్రమే కాకుండా బంధకాలలో నుండి కూడా ఈ పత్రికను రాసాడు - 4:16 - 18 - ''నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అందరు నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక.''  ''మొదట'' అనే పదమును గమనించండి. తర్కముతో వాదిస్తే, ''మొదట'' అనే పదము వుంది అంటే ''రెండవసారి'' సంఘటన కూడా ఉండాలి. 

తిమోతి కి వ్రాసిన ఈ పత్రికలో, పౌలు తిమోతికి కావలసిన హెచ్చరికలను ఇస్తున్నాడు. (ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన పత్రిక కాబట్టి). మరియు పౌలు పట్ల, సువార్త పట్ల తిమోతి యొక్క బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. 

Hermeneia అనే వ్యక్తి ఇలా చెప్తాడు: బోధకునికి శిష్యునికి మధ్య వున్న సంబందాన్ని బట్టి విశ్వాసముకొరకైనా శ్రమల గూర్చి హెచ్చరికలని ఇచ్చాడు. వాటి ఆధారముగా ఈ రెండవ పత్రిక వ్రాయబడింది.

2 తిమోతి 1:1 - "క్రీస్తుయేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది."   

''క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు,'' ఇది పౌలు సహజముగా తన యొక్క అపొస్తలత్వము యొక్క గుర్తింపు మరియు అధికారము తో చెప్పే శుభము. ఈ వచనము రచయిత ఎవరో కూడా తెలియచేస్తుంది.

అపోస్తులుడు అనగా అర్ధం ఏంటి?

ప్రత్యేకమైన వర్తమానికుని బాధ్యతను నిర్వర్తించే వ్యక్తిని అపోస్తులుడు అంటారు. (ఇది సహజముగా యేసుక్రీస్తు యొక్క శిష్యులకు మాత్రమే పరిమితమైంది, అయినప్పటికి, పౌలు విషయములోను మరియు సువార్తను ప్రకటించిన ఆదిమ క్రైస్తవుల వరకు ఈ పాత్ర విస్తరించింది) - అపోస్తులుడు, ప్రత్యేక వర్తమానికుడు. (Παῦλος δοῦλος Χριστοῦ Ἰησοῦ, κλητὸς  πόστολος). యేసుక్రీస్తు దాసుడును, అపోస్తులుడుగా ఉండుటకు (దేవుని చేత) పిలువబడినవాడు. రోమా 1:1 యేసుక్రీస్తుతో ఒక అపోస్తులుని యొక్క సంబంధం కొన్ని సందర్భాలలో ''క్రీస్తు యొక్క వర్తమానికుడుగా'' మరియు యేసుక్రీస్తు యొక్క ప్రత్యేక వర్తమానికుడుగా చెప్పబడినది. అటువంటి పదములలో ''ప్రత్యేకమైన'' అనే పదము యేసుక్రీస్తు ద్వారా నిర్దేశించబడిన ఒక ప్రత్యేకమైన పనిని లేక బాధ్యతను సూచిస్తుంది.

యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు అనే పదము పౌలు పరిచర్య చేయుటకు క్రీస్తు చేత పంపబడ్డాడు అని అర్ధం.

''దేవుని చిత్తము వలన'' అనే పదము కొన్ని తర్జుమాలలో ద్వారా అనే పదముతో కూడా అనువదించబడింది. దేవుని చిత్తము ద్వారా అని అర్ధం (1 కొరింథీ 1:1; కొరింథీ 1:1; ఎఫెసీ 1:1, కొలస్సి 1:1) . దేవుని చిత్తము వలన / దేవుని చిత్తము ద్వారా అని చెప్పటంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? తన జీవితములో మరియు తన యొక్క అపొస్తలత్వానికి సంబంధించి దేవుని యొక్క కార్యాన్ని తెలియచేస్తున్నాడు (గలతి 1:15 - 16).

''క్రీస్తుయేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి'' - ఇది పౌలు యొక్క అపొస్తలత్వము యొక్క ఉద్దేశాన్ని మరియు లక్ష్యాన్ని తెలియచేస్తుంది. 

కానీ ''క్రీస్తుయేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము" అంటే అర్ధం ఏంటి? జీవమును గూర్చిన వాగ్దానము అనే పదము 1 తిమోతి 4:8 లో కూడా కనపడుతుంది. దాని యొక్క అర్ధము ఏమనగా జీవము అనే అంశముకు సంబంధించి వాగ్దానము అనే ఆధారము దేవుని దగ్గర వున్నది. ఒక విధముగా  చెప్పాలంటే ''దేవుడు వాగ్దానము చేసిన జీవము '' అని అర్ధం. జీవము అనగా నిత్యజీవము అని అర్ధం. 1 తిమోతి 1:16 కూడా చూడండి. కాబట్టి దీనిని ఇలా చెప్పవచ్చు, ''తాను వాగ్దానము చేసిన నిత్యజీవమును ఆయన నాకు యిచ్చియున్నాడు.'' 

''వాగ్దానమును బట్టి'' - NIV (New International Version) తర్జుమా దీనిని వాగ్దానముతో కాపాడుట అని తర్జుమా చేసింది. సరిఅయిన అనువాదం ఏమనగా క్రీస్తుయేసు నందున్న వాగ్దానమునకు అనుగుణంగా అని అర్ధం. 

2 తిమోతి 1:2 "ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది, తండ్రిఐన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక." 

ఈ వచనము ఈ పత్రికను అందుకొనేది ఎవరు అనేది తెలియచేస్తుంది.

''ప్రియ కుమారుడగు తిమోతి'' - ఆత్మీయ అర్థంలో తిమోతి పౌలుకు కుమారుడు. 

''కృపయు, కనికరమును, సమాధానమును''

కృప - దేవుని యొక్క దయ (BDAG, 1079). 

కనికరము - అవసరతలో ఉన్నవారి పట్ల తీసుకొనే శ్రద్ద. కనికరము, దయ, జాలి (BDAG, 316), ప్రత్యేకించి, దేవుని నుండి మానవులకు. 

సమాధానము - నెమ్మది కలిగిన స్థితి హెబ్రీ భాషలో షాలోమ్ అనే పదముతో చెప్పబడింది (BDAG, 287). 

''తండ్రిఐన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు'' - శుభములు ఎక్కడనుండి కలుగుతున్నవి అనే దానిని సూచిస్తుంది. 

''తండ్రిఐన దేవుని నుండి మరియు ప్రభువైన క్రీస్తుయేసునుండి'' - తండ్రి కుమారుల ప్రత్యేకతను పౌలు సహజముగా తెలిపే పద్దతి.

2 తిమోతి 1:3 - "నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, న పితురాచారప్రకారమైన నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనైయున్నాను." 

''దేవుని యెడల కృతజ్ఞుడను'' - కృతజ్ఞత చెల్లించే సాధారణ పద్దతి.  

''నేను సేవించుచున్న'' - ఇది పౌలు తాను సేవించుచున్న దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. ''సేవించుట'' అనగా అర్ధం ''భక్తితో కూడిన క్రియలు చేయటం, ఆరాధించటం, స్తుతించటం అని అర్ధం'' మరియు ఈ రోజు మనము  సేవిస్తున్నట్టు కాదు. 

''నిర్మలమైన మనసాక్షితో'' -  ఏదో ఒకదానిని గూర్చిన జ్ఞానమును కలిగియుండుట. ఈ సందర్బములో, నిర్మలమైన మనసాక్షి అనేది దేవుని వైపునకు వుంది. అది , తన పితరులు ఆరాధించినట్టుగా నిర్మలమైన మనసాక్షితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 

ఇంకా చెప్పాలంటే, తన పితరులు ఆరాధించిన దేవుణ్ణి తాను కూడా ఆరాధిస్తున్నాను అనే అద్భుతమైన మాటను పౌలు చెప్పడంలో ఒక ఉద్దేశం వుంది (NIV సరిఅయిన తర్జుమాను కలిగి వుంది. - నా పితరులు చేసినట్టుగా). ఈ వాక్యంలో పోలికను చూపించే  అంశం వుంది. ఐతే ఏంటది? రెండు కారణాలు మనము గమనించగలము: 

పాత నిబంధనకు మరియు తాను ప్రకటించే సువార్తకు కొనసాగింపు ఉందని పౌలు తిమోతికి  తెలియచేస్తున్నాడు. (అ.కా 24:14; 26:6; రోమా 2:28 - 29; 4:9 - 17; 9:1 - 9 గలతి 3:6 - 9). 

అబద్ద బోధకుల సమస్య - వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు వారు పాత నిబంధనను ఉపయోగిస్తున్నారు.

''నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు'' - ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే అర్ధం తిమోతి గురించి మాత్రమే ఎల్లపుడు ప్రార్థన చేస్తున్నాడు అని కాదు కాని తాను ప్రార్థన చేసినప్పుడల్లా తిమోతిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని అర్ధం.

ఈ వచనంలో గమనించవలసిన ఒక అంశం ఏంటంటే : ''నా పితురాచారాప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుడు'' అనే పొందుపరచబడిన  నిబంధన. ఈ నిబంధన యొక్క ఉద్దేశం ఏమనగా తరువాత వచ్చే వాటన్నిటికీ సమాధానాలు చెప్పడానికి. 

2 తిమోతి 1:4 - "నీ కన్నీళ్లను తలచుకుని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనన్ని రేయింబగళ్లు అపేక్షించుచున్నాను." 

''నీ కన్నీళ్లను తలచుకుని'' - పౌలు మరియు తిమోతి భావోద్వేగాలతో  కూడిన సందర్భాన్ని కలిగి వుండి వుంటారు. బహుశా తిమోతి పౌలును విడిచిపెట్టిన సందర్భం కావొచ్చు (మనకు తెలియదు). కారణాలు ఏమైనప్పటికి , తిమోతి యొక్క కన్నీళ్లను పౌలు జ్ఞాపకము చేసుకున్నాడు (లేక చేసుకుంటున్నాడు). ఇది ప్రాముఖ్యముగా గుర్తించవలసిన సమయం. మరొక పక్కన, పౌలు,  తిమోతి దూరమైనా సందర్భం లేకపోతె నిన్ను చూడవలెనని అపేక్షించుచున్నాను అని పౌలు చెప్పి ఉండేవాడు కాదు (1 తిమోతి 1:3).

పౌలు మరియు తిమోతి విడిపోయిన సందర్భం తిమోతిని చూడాలన్న కోరికను పౌలుకు పుట్టించింది. తరువాత తిమోతిని చూడాలనుకున్న ఉద్దేశాన్ని పౌలు తెలియచేసాడు- అది, ఆతడు సంపూర్ణానందముతో నింపబడుటకు.

NIGTC ఇలా చెప్తుంది, ఇక్కడ చెప్పబడిన క్రియ దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది (రోమా 15:13). 

మరొక పక్కన Gordon Fee ఇలా చెప్తాడు: 

ఈ వాక్యం ప్రధాన అంశం నుండి పక్కకు తప్పినట్టు అనిపించినప్పటికీ ఈ పత్రిక యొక్క అంతిమ కారణానికి చెందిన గమనికను చేరువ అవుతుంది. ఎఫెసులో అసంపూర్తిగా పని మిగిలిపోయి యున్నప్పటికి, తన జీవిత చివరి దినములలో, ఒంటరి జీవితములో తిమోతి ఉండాలి అనేది పౌలు యొక్క కోరిక (2:2, 4:6 - 8, 9, 16, 21 చూడండి). అందుచేత, అతనికి సంపూర్ణానందము కలుగుటకై పౌలు తిమోతిని చూడాలని ఆశపడుతున్నాడు.

2 తిమోతి 1:5 "నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని ... ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోనూ, నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నాడని నేను రూఢిగా నమ్ముచున్నాను."

3 - 5 వచనాలు కలిపి ఒకే అంశంగా చెప్పబడ్డాయి. 

''నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని'' - తాను ఎందుకు తిమోతిని గూర్చి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడో కారణాన్ని లేక ఆధారాన్ని తెలియచేస్తున్నాడు - ఎందుకంటే అతని యొక్క నిష్కపటమైన విశ్వాసమును బట్టి. 

''ఆ విశ్వాసము మొదట నీ అవ్వఅయినా లోయిలోనూ నీ తల్లి అయినా యునికేలోను వసించెను'' - తిమోతి యొక్క అవ్వ వలె మరియు అతని యొక్క తల్లి వలె తిమోతి యొక్క విశ్వాసము కూడా నిజమైనది మరియు ఖచ్చితమైనది. 

''అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను'' - దేనిని గూర్చి చెప్పాలంటే పౌలు జ్ఞాపకము చేసుకున్న తిమోతి యొక్క నిష్కపటమైన విశ్వాసము అతని యొక్క అవ్వ మరియు తల్లి కలిగియున్న విశ్వాసము వంటిదే. 

EBC ఏమి చెప్పిందో ఒకసారి గమనించండి. 

పౌలు యొక్క కృతజ్ఞతకు కారణము తిమోతి యొక్క నిష్కపటమైన విశ్వాసము. (anypokritos గీక్ 537; 1 తిమోతి 1:5; రోమా 12:9, 2 కొరింథీ 6:6). శిష్యుడు అపోస్తులుని యొక్క వారసత్వాన్ని కొనసాగించుటకు సహాయ పడుతుంది. ఎలాగైతే పేతురు యొక్క ఒప్పుకోలు ఆధారముగా యేసుక్రీస్తు తన సంఘాన్ని నిర్మించాడో (మత్తయి 16:18 -19), అదే రీతిగా తిమోతి యొక్క నిష్కపటమైన విశ్వాసము ఆధారముగా పౌలు అపొస్తలులు స్థాపించిన సంఘాన్ని తిమోతికి అప్పగించాలని ఉద్దేశించాడు. తిమోతిలో వున్నా స్థిరమైన విశ్వాసము స్పష్టంగా తెలుస్తుంది. తిమోతి తన అవ్వ మరియు తన తల్లి యొక్క విశ్వాసాన్ని కలిగి వున్నాడు.

తిమోతి యొక్క విశ్వాసాన్ని ఆధారము చేసుకుని వ్యక్తిగత హెచ్చరికలు. 

2 తిమోతి 1:6 - "ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను."

''ఆ హేతువుచేత'' -  ఇది కారణాన్ని సూచిస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే, నీ అవ్వ మరియు నీ తల్లిలో వున్న విశ్వాసము నీలో కూడా ఉందని నేను గమనించాను కాబట్టి, నేను జ్ఞాపకము చేస్తున్నాను ..... అని అర్ధం.

''నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను'' - నీకు జ్ఞాపకము చేశాను అనే  మాట నీకు జ్ఞాపకము చేస్తూ వున్నాను అని అనువదించడం సరి అయినదిగా ఉంటుంది. పౌలు తిమోతికి జ్ఞాపకము చేసిన అంశం ఏంటి? తిమోతి లో వున్న దేవుని కృపావరమును గురించి జ్ఞాపకము చేస్తున్నాడు. ఐతే, ఏమిటి ఆ కృపావరము? బోధించడము: ఎందుకంటే ఇది అతని పరిచర్యకు సంభందించినదిగా వున్నది. 

''ప్రజ్వలింపచేయుము'' - మరలా ప్రారంభించుము అని అర్ధం. ''పునరుద్ధరించుట, లేక మరలా ప్రారంభించుట.'' తిమోతి లో వున్న దేవుని కృపావరమును మరల ప్రారంభించామని పౌలు ఎందుకు జ్ఞాపకము చేస్తున్నాడు? 

పౌలు జ్ఞాపకాము చేసేంతగా తిమోతి తన యొక్క కృపావరమును మర్చిపోయాడా? కాదు. ప్రతి సేవకుడు తన యొక్క ఆసక్తిని గూర్చి జ్ఞాపకము చేయబడుతూ ఉండాలి లేక ప్రతి సేవకుడు తన యొక్క ఆసక్తిని సేవకొరకు నూతనపరచుకోవాలి. ఒక వ్యక్తి తన యొక్క ఆసక్తిని నూతనపరచుకోవాలి లేక జ్ఞాపకము చేయబడాలి అనే దానికి చాల కారణాలు ఉండవచ్చు. సంఘములో వున్న సమస్యలను బట్టి కావచ్చు లేక తిమోతి యొక్క వ్యక్తిగత జీవితములో వున్న సమస్యలు కావచ్చు (సమాజములో వున్న అబద్ద బోధకుల యొక్క ఒత్తిడి ఉందేమో?) తిమోతి జ్ఞాపకము చేయబడతాము అవసరము. అంతకు మించి, సంఘ సమస్యలను పరిష్కరిస్తూ, తిమోతికి ఒక చక్కని మాదిరిగా వున్న అపోస్తులుడైన పౌలు నుండి ఈ జ్ఞాపకము చేయబడింది అనే విషయాన్నీ తిమోతి జ్ఞాపకము చేసుకోవాలి.           

''నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన'' - మరొక చోట, పెద్దలు హస్త నిక్షేపణము చేసారు అని వుంది. (1 తిమోతి 4:14), ఇక్కడ పౌలు తన యొక్క హస్త నిక్షేపణము గురించి మాట్లాడుతున్నాడు. ఇది పౌలు కు మరియు తిమోతి కి మధ్య వున్న సన్నిహితమైన సంబంధాన్ని తెలియచేస్తుంది. కేవలము పెద్దలు మాత్రమే కాదు కానీ పౌలు కూడా తిమోతిని దీవించాడు. 

2 తిమోతి 1:7 - "దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనముగల ఆత్మను ఇయ్యలేదు."

ఈ వాత్క్యం అంతా 6 వచనంతో సంబంధమును కలిగి వుంది - ''నీలో వున్న దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయుము.''

''దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు'' - ఈ మాట కారణాన్ని తెలియచేస్తుంది. అది, నీలో వున్న దేవుని కృపావరమును ప్రజ్వలింపచేయుము ఎందుకంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. 

పిరికితనం గల ఆత్మా అంటే అర్ధం ఏంటి? పిరికితనం అనే మాటకు అర్ధం - మానసిక మరియు నైతిక శక్తి లేకపోవటం (BDAG, 215). ఆత్మ అనే పదం చిన్న అక్షరాలతో వుంది.

ఇది వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధించిందా లేక పరిశుద్ధాత్మకు సంబంధించిందా?

NAC దీన్ని గూర్చి ఇలా చెప్తుంది. ఇక్కడ చెప్పబడిన ఆత్మ పరిశుద్ధాత్మకు సంభందించినది కాదు కానీ ఇక్కడ చెప్పబడిన లక్షణాలకు పరిశుద్దాత్మ కర్తగా వున్నాడు. ఇక్కడ చెప్పబడిన లక్షణాలు ప్రత్యేక పరిచర్యలు చేయుటకు బహుమానంగా ఇవ్వబడినవి.

ఈ వచనము వివరించుటకు బహు క్లిష్టమైనది. 

కారణము ఏంటంటే, ఇక్కడ రెండు ధ్రువీకరణలు వున్నాయి. ఒకటి అనుకూల ధ్రువీకరణ, మరొకటి వ్యతిరేక ధ్రువీకరణ. 

వ్యతిరేక ధ్రువీకరణ ఏమనగా - దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు, అనుకూల ధ్రువీకరణ ఏమనగా, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే ఇచ్చాడు. 

కాబట్టి, ఆత్మ అను పదమును అర్ధం చేసుకోవటానికి సులభమైన మార్గం ఏంటీ? 

మరొక చోట, 1 కొరింథీ 12:5, రోమా 5:5; 2  కొరింథీ 1:22, 5:5, 1 థెస్స 4:8 వచనాలలో, పరిశుద్ధాత్మకు సూచించడానికి పౌలు ఉపయోగించాడు. ఈ వచనముల ఆధారముగా ఇక్కడ చెప్పబడిన ఆత్మ, పరిశుద్ధాత్మకు సూచనగా అర్ధం చేసుకోవచ్చు (ఏది ఏమైనప్పటికి, ఈ రెండు వాదనలు కూడా పరిగణలోనికి తీసుకోవచ్చు - మానవ ప్రవర్తన, మరియు పరిశుద్దాత్మ).

Gordon Fee ఇలా చెప్తాడు, ఇక్కడ వ్రాయబడిన ఆత్మ అనే పదము మానవ ప్రవర్తనకు సంభందించినది అని ఎవరైతే నమ్ముతారో వారు 6 మరియు 7 వచనాలు మధ్య వున్నా సంబంధాన్ని మర్చిపోతున్నారు. 

ఆత్మ అనే పదము చిన్న అక్షరాలతో వ్రాయబడినప్పటికి 6 మరియు 7 వచనాలు మధ్య వున్నా సంబంధాన్ని మర్చిపోవడం అనేది సరిఐనది కాదు. అలాగే ఇతర చోట్ల పౌలు ఉపయోగించిన భాష మరియు సిద్ధాంతాలను మర్చిపోకూడదు. దేవుడు మనకు ఇచ్చిన ఏదో ఒక ఆత్మను గూర్చి పౌలు ప్రస్తావించటం లేదు (తనకు, తిమోతికి మరియు శ్రమలను ఎదుర్కునే ప్రతి విశ్వాసికి) పరిశుద్దాత్మ దేవుడు కొంత ఖచ్చితత్వాన్ని కొన్ని విశాల ద్వారా పొందుపరిచాడు: (a) ఈ వచనము 6 వ వచనంతో అనుసంధానము కలిగి వుంది. (b) charisma అనే పదమునకు ఆత్మ అనే పదమునకు దగ్గర సంబంధము వుంది. అనేది పౌలు పత్రికలన్నిటిలో కనపడుతుంది. (7వ, 1 తిమోతి 4:14). (c) శక్తి మరియు ప్రేమ అనే పదాలు పౌలులో వున్నఆత్మను సూచిస్తున్నాయి మరియు. (d) ఈ వచనమునకు మరియు 1 తిమోతి 4:14వ వచనమునకు దగ్గర సంబంధము వుంది. అక్కడ తిమోతి పరిశుద్దాత్మ కార్యము ద్వారా వరమును పొందుకున్నట్లుగా చూడగలము. 
ఇంకా చెప్పాలంటే, కాని అనే వ్యత్యాసాన్ని తెలిపే పదాన్ని పౌలు ఉపయోగించాడు, ప్రత్యేకించి రోమా 8:15 మరియు 1 కొరింథీ 2:12 వచనలో ఈ వ్యత్యాసాన్ని చూడగలము. ప్రతి సందర్బములో కూడా పౌలు వ్యతిరేక పదాన్ని ఉపయోగించాడు అది పరిశుద్ధాత్మకు ఏ మాత్రం సంభందించినది కాదు. (దాస్యపు ఆత్మ, లౌకిక ఆత్మ మరియు పిరికితనం గల ఆత్మ అనే పదములు). ఐతే ప్రతి సందర్బములో కాని అనే వ్యత్యాసాన్ని తెలిపే పదము పరిశుద్దాత్మను సూచిస్తుంది. పౌలు యొక్క ఉద్దేశము ఇలా వుంది: దేవుడు మనకు ఆత్మను ఇచ్చినపుడు, మనము పిరికితనం గల ఆత్మను పొందుకోలేదు, కాని శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే పొందుకున్నాము.          

2 తిమోతి 1:8 - "కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైనా నన్నుగూర్చి ఐనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము."

దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు కాబట్టి, ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడకుము. ఇక్కడ కొనసాగింపుతో కూడిన ఆలోచన మరియు ప్రోత్సాహకరమైన ఆలోచన ఇమిడి వుంది.

ఇక్కడ పౌలు ఏమి చేస్తున్నాడు? క్రీస్తు పట్ల మరియు సువార్త పట్ల వున్నా భాధ్యతను పౌలు నుండి తిమోతి కొనసాగించాలని కోరుతున్నాడు.

రెండు విషయాలను గూర్చి సిగ్గుపడకూడదు (1) ప్రభువును గూర్చిన సాక్ష్యము గూర్చి సిగ్గుపడకూడదు, మరియు (2). ఖైదీ ఐన పౌలును గూర్చి సిగ్గుపడకూడదు. 

  1. ప్రభువును గూర్చిన సాక్ష్యము - ఏంటి దీని అర్ధం? ఏదైతే సాక్ష్యముగా ఉందొ లేక చెప్పడిందో ఆ సమాచారం అని అర్ధం. యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇది సూచిస్తుంది. 
  2. ఖైదీ ఐన పౌలు - యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తము పౌలు అనేక సందర్భాలలో చెరసాలలో వుంచబడ్డాడు. ఈ పత్రికను వ్రాసే సమయానికి అతడు చెరసాలలో వున్నాడు. 

అయినప్పటికీ, సువార్త నిమిత్తమై శ్రమలలో పాలిభాగస్తుడుగా ఉండమని పౌలు తిమోతిని కోరుతున్నాడు. ఇక్కడ శ్రమ అని చెప్పబడిన పదము మరొకరితో కలిసి శ్రమపడుము అనే ఆలోచనను ఇస్తుంది.

Gordon ఇలా చెప్తాడు: 

ఈ పిలుపు సువార్త నిమిత్తము చెరసాలలో ఉంచబడిన పౌలు యొక్క జీవితాన్ని స్పష్టముగా సూచిస్తుంది. (2:9). 3:12 లో చెప్పబడిన రీతిగా సువార్త నిమిత్తము పౌలు పొందిన శ్రమ సువార్తను నిరంతరమూ ప్రకటిస్తున్న పరిచర్యలో భాగముగా కలిగినవి. (ఉదా: 1 థెస్స 1:6; 2:14, 3:4; 2 కొరింథీ 4:7 - 15, రోమా 8:17; కొలస్సి 1:24, ఫిలిప్పి 1:12, 29). పౌలు అర్ధం చేసుకున్న ప్రకారముగా ఈ శ్రమ అనేది క్రీస్తు పొందిన శ్రమలకు శారీరకంగా పొందిన శ్రమకు మరియు సిలువ యొక్క అవమానమునకు దగ్గరగా వున్నవి. ఈ సందర్బములో మాత్రమే రెండు అసమానతలను ఖచ్చితముగా వినవచ్చు. అవి వాస్తవానికి ఒకే వాస్తవికత యొక్క రెండు వైపులా ఉంటాయి.

పౌలు కొరకు శ్రమపడమనే ఉద్దేశము కాదు ఇక్కడ, కానీ సువార్త నిమిత్తము మరియు క్రీస్తుయేసు నిమిత్తము పౌలుతో పాటు శ్రమలలో పాలిభాగస్తుడిగా ఉండమని.  

''దేవుని శక్తిని బట్టి'' - మన యొక్క (పౌలు, తిమోతి, మరియు మనమందరము) శ్రమ మానవ శక్తి మీద ఆధారపడి లేదు కాని దేవుని శక్తి మీద ఆధారపడి వుంది. దేవుడు లేక ఆయన కృప వలన మాత్రమే ఒక వ్యక్తి శ్రమలను తట్టుకుని నిలబడగలడు. మరొక చెప్పాలంటే, తిమోతి దేవుని శక్తి మీద ఆధారపడాలి ఎందుకంటే అతనిలో వున్నా దేవుని యొక్క శక్తి గల ఆత్మ ఆతనికి శక్తిని ఇస్తుంది (ఎఫెసీ 3:16, 20). 

2 తిమోతి 1:9 -  "మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అందికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను."

''ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచెను.'' 8వ వచనంలో చెప్పబడిన ఆలోచనను విపులముగా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. 8వ వచనంలో ఇలా చెప్పాడు, ప్రభువు విషయమైన సాక్ష్యము గూర్చి సిగ్గుపడకు అని చెప్పాడు. ఎందుకు? కారణము ఏమనగా, ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు కాబట్టి. 

''మన క్రియలను బట్టి కాదు కాని, తన స్వకీయ సంకల్పమును బట్టి, మరియు తన కృపను బట్టి'' -  పౌలు తరచుగా సత్క్రియలు అనే పదమును ఉపయోగించాడు, ఐతే ఈ సత్క్రియలు క్రైస్తవ జీవన విధానాన్ని చూపిస్తాయి. ఏది ఏమైనప్పటికి, ఇక్కడ మన క్రియలను బట్టి కాక అనే పదమును ఉపయోగించాడు. ఇది రక్షణకు సంబంధించినది. దేవుడు వారిని అలాగే మనలను రక్షించాడు, మనము ఏమి చేసాము అనే దానిని బట్టి కాదు కాని, రక్షణ కార్యము దేవుని ఉద్దేశము మరియు దేవుని కృప వలన జరిగింది. 

తరువాత, ఆ కృపకు ఆధారమైన దానిని పౌలు చెప్తున్నాడు, అనాది కాలముమననే క్రీస్తుయేసు నందు మనకు ఇవ్వబడినది. 

NAC ఈ వచనాన్ని ఆసక్తికరమైన విధానములో క్లుప్తీకరించింది:

దేవుని శక్తిని పొందుకోవడానికి సువార్త ద్వారము తెరుస్తుందని పౌలు చూపించాడు. ఆ క్రమమును, ఉద్దేశమును, రక్షణకు ఆధారమును పౌలు విభజించి చెప్పాడు. రక్షణ యొక్క ప్రక్రియ దేవుని రాజ్యములో పాలిభాగస్తులుగా ఉండమని పిలిచినా పిలుపుతో  ప్రారంభమవుతుంది. ఈ పిలుపు బహిరంగముగా సువార్త ప్రకటన ద్వారా, అంతరంగికంగా వాక్యము ద్వారా ఆత్మ యొక్క ప్రభావాన్ని బట్టి ఇవ్వబడుతుంది. రక్షణ యొక్క ఉద్దేశము ఏమనగా విశ్వాసి విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలి మరియు తన పట్ల కాకుండా దేవుని దృష్టిలో పరిశుద్ధముగా జీవించాలి. రక్షణకు ఆధారము మానవ క్రియలు కాదు కాని దేవుని యొక్క ఉద్దేశము  మరియు ఆయన కృప.

2 తిమోతి 1:10 - "క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను."

క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షయత వలన బయలుపరచబడినది ఏమిటి? కృప. కృప (యేసుక్రీస్తు) ప్రత్యక్షపరచబడెను అనగా అర్ధం, అందరికి కనపడేలా చేయబడుట అని అర్ధం (L-N 24.19). 

ద్వారా - యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడుట ద్వారా. 

''ఆయన మరణమును  నిరర్థకము చేసి జీవమును, అక్షయతను  సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను.'' - ఆయన నిరర్థకము చేసాడు. ఆయన అనే పదము క్రీస్తును చూపిస్తుంది. ఆయన మరణమును కొట్టివేయడం మాత్రమే కాదు - మరణమును యొక్క శక్తిని కొట్టివేసాడు (BDAG, 525) - అతడు (క్రీస్తు) మరణము ఇక పని చేయకుండా చేసాడు (Gordon Fee, 229). 

''జీవమును, అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చెను'' - క్రీస్తు ద్వారా మరణము పని చేయకుండా చేయబడింది, ఆయన జీవమును, అక్షయతను తెచ్చాడు అనగా అర్ధం, నశించిపోని లేక క్షయమైపోనీ జీవమును తీసుకు వచ్చాడు అని అర్ధం. భవిష్యత్ జీవము యొక్క శ్రేష్ఠత (BDAG,155).

''సువార్త ద్వారా'' - యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటన ద్వారా.

2 తిమోతి 1:11-12 - "ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడుగాను, అపోస్తులుడుగాను, బోధకుడుగాను, నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను."

పౌలు శ్రమ యొక్క ఉద్దేశం వృధాగ పోలేదు. అతడు సువార్త కొరకు శ్రమ పడ్డాడు. కాబట్టి 8-10 వచనాలలో, పౌలు తాను సువార్త ప్రకటించువాడుగా, మరియు బోధకుడిగా నియమించబడ్డాడు అని చెప్తున్నాడు. ఈ కారణాన్ని బట్టి (సువార్త నిమిత్తం) అతడు శ్రమ పడ్డాడు. 

ఇక్కడ పౌలు చెప్పేదేమిటి? సువార్తలో తన యొక్క పాత్రను చెప్పుకుంటున్నాడు (సువార్త ప్రకటన) . 

''ఈ శ్రమలను అనుభవించుచున్నాను'' - ప్రాధమికంగా, పౌలు చెరసాలలో వున్నాడు. కాబట్టి సువార్త నిమిత్తం మరియు సువార్త ప్రకటనలో తన యొక్క పాత్ర నిమిత్తం పౌలు శ్రమపడుతున్నాడు. అయినప్పటికీ, తిమోతిని సిగ్గుపడొద్దు అని హెచ్చరిస్తున్నాడు. 

తిమోతి ఎందుకు సిగ్గుపడకూడదో కారణాన్ని తరువాత చెప్తున్నాడు - ''నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను.''

సిగ్గుపడుట అనగా అర్ధం, ''బాధను అనుభవించుట లేక ఒక ప్రత్యేకమైన సంఘటన కొరకు లేక కార్యక్రమము కొరకు హోదాను వదులుకొనుట'' (BDAG, 357). తిమోతి ఎందుకు సిగ్గుపడకూడదు అనే కారణాన్ని పౌలు తెలియచేసాడు అది పౌలును బట్టి కాదు కాని, యేసుక్రీస్తును గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. అతని యొక్క అంశం ఇది. సువార్త నిమిత్తం నేను చెరలో వున్న కారణాన్ని బట్టి, సువార్త ప్రకటన యొక్క లక్ష్యాన్ని విడిచిపెట్టకు అని అర్ధం. 

''నేను నమ్మిన వాని ఎరుగుదును'' - పౌలు క్రీస్తు నందు విశ్వాసముంచాడు. ఇది వ్యక్తిగతమైన కార్యము.

''ఆయనకు అప్పగించినదానిని ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను'' - దేవుడు సువార్తను కాపాడుతాడు అనేది వాస్తవము - ఎందుకంటే (1) దేవుడు కాపాడగలడని పౌలు రూఢిగా నమ్మాడు. (రూఢిగా అనే మాటకు అర్ధం ఒక విషయములో కలిగిన ఖచ్చితత్వం, BDAG, 792). ఇక్కడ దేవుని యొక్క కార్యాన్ని గూర్చి పౌలు ఖచ్చితత్వాన్ని కలిగి వున్నాడు.

''అప్పగించిన దానిని'' - పౌలుకు అప్పగించబడినది ఏమనగా దేవుని వాక్యం. 

''రాబోవు చున్న ఆ దినము వరకు'' - దేవుని యొక్క అంత్య తీర్పు దినము (1:18, 4:8; జెఫన్యా 1:15). 

2 తిమోతి 1:13. క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును గైకొనుము. 

''నా వలన హితవాక్య ప్రమాణమును గైకొనుము'' - పౌలు యొక్క ఆరోగ్యకరమైన వాక్యాన్ని మరియు సూచనలను తిమోతి విన్నాడు. కాబట్టి, తాను అవలంబించిన విధానాన్ని కొనసాగించమని తిమోతిని కోరుతున్నాడు - తాను బోధించిన విధానము (ఇది పౌలు యొక్క హావభావాలు కాదు కాని, సువార్తను ప్రకటించుట యందు ఖచ్చితత్వము, మరియు నమ్మకత్వమును కలిగియుండుట). 

ఈ బోధన విధానము మరికొన్ని అంశాలతో ఇమిడి వున్నది: విశ్వాసము మరియు ప్రేమ. ఇవి క్రీస్తు నందు ప్రాముఖ్యమైన అంశాలుగా వున్నవి. క్రీస్తు విశ్వాసమునకు మరియు ప్రేమకు కర్తయై వున్నాడు. 

2 తిమోతి 1:14. "నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్దాత్మ వలన కాపాడుము."

''మంచి పదార్థమును కాపాడుము'' - నీకు ఏమైతే అప్పగించబడిందో దానిని అనగా, సువార్త వాక్యాన్ని. 

ఈ మంచి పదార్ధము వారిలో (మనలో మరియు విశ్వాసులందరిలో) నివసించుచున్న పరిశుద్దాత్మ వలన కలిగినది. 

2 తిమోతి 1:15 "ఆసియాలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు." 

14వ వచనము వరకు తిమోతి దేవునికి, సువార్తకు, మరియు పౌలుకు నమ్మకముగా ఉన్డలి అనే వాదనలు మరియు వాటికీ జవాబులు పౌలు ఇస్తూ వచ్చాడు. ఈ వచనంలో, అపనమ్మకంగా వున్న ప్రజలను గూర్చి చెప్తున్నాడు. 

''నీవెరుగుదువు'' - తిమోతికి ఈ విషయం తెలుసు. 

''ఆసియాలోని వారందరు నన్ను విడిచిపోయిరి'' - అందరు ఎవరు అనేది మనకు తెలియదు. కాని కొంత వరకు ఊహించవచ్చు (ఊహ మంచిది కాదు, కాని కొంతవరకు చేయవచ్చు) . కొంతమంది పౌలును విడిచిపెట్టారు. ఐతే పౌలు అందరిని కలిపి చెప్తున్నాడా? కావచ్చు. పౌలు చెప్పినట్టుగా అందరు అలాగే వున్నారా? వుంది ఉండవచ్చు. 

2 తిమోతి 1:16 - "ప్రభువు ఒనేసిఫొరు ఇంటివారియందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినపుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్దగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను."

తనను విడిచిపెట్టని మరియు తన సంకెళ్లను గూర్చి సిగ్గుపడని ఒనేసిఫొరును గూర్చి పౌలు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి అతనికి, మరియు అతని కుటుంబానికి దేవుడు కనికరము చూపాలని పౌలు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అనేక పర్యాయములు ఆతడు పౌలును ఆదరించాడు. 

2 తిమోతి 1:17 - "అతడు రోమాకు వచ్చినపుడు నన్ను శ్రద్దగా వెదికి, కనుగొన్నాడు."

ఒనేసిఫొరు కేవలం పౌలును గూర్చి సిగ్గుపడకుండా అతనిని ఆదరించడం మాత్రమే కాదు కాని అతడు పౌలును శ్రద్దగా వెదికి కనుగొన్నాడు. ఇది పౌలు పట్ల వున్న శ్రద్ధను మరియు నమ్మకత్వాన్ని కలిగియున్న మాదిరి వ్యక్తి అని చూపిస్తుంది.

2 తిమోతి 1:18 - "అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో నీవు బాగుగ ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక."

పౌలు ఇంకా ఒనేసిఫొరును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆ దినమందు అనగా న్యాయపు తీర్పు దినమందు ప్రభువు అతనికి కనికరము చూపించాలని పౌలు కోరుకుంటున్నాడు. 

''అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో నీవు బాగుగ ఎరుగుదువు''- ఒనేసిఫొరు యొక్క పనిని గూర్చి మరియు అతడు ఎఫెసులో ఏమి చేసాడో తిమోతికి బాగా తెలుసు. 

16-18 వచనాలలో పౌలు చెప్పదలచుకున్న అంశం ఏంటి?

పౌలు పట్ల నమ్మకముగా వున్న వ్యక్తిని గూర్చి అతడు చెప్తున్నాడు. అతడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే , పౌలు ఈ పత్రిక వ్రాసే సమయానికి బహుశా ఆతడు మరణించి ఉండవచ్చు. ఈ వయక్తి పౌలుకు మరియు తిమోతికి బాగా తెలిసిన వాడు కాబట్టి ఒనేసిఫొరు వలె ఉండమని తిమోతికి పౌలు చెప్తున్నాడు.               

Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.

>