About How To Build Your Faith
This course is for those who struggle in their Christian Faith or with their trust in God!
A lot of Christians struggle in some ways with their trust in God. This course will help you gain clarity in understanding the passages that talk about faith, and help you live a stronger Christian life that pleases God.
ఎవరైతే క్రైస్తవ విశ్వాసమును గూర్చి సతమతమవుతున్నారో లేక దేవుని యందు వారికున్న నమ్మకముతో సతమతమవుతున్నారో వారికొరకు ఈ కోర్సు.
చాలా మంది క్రైస్తవులు దేవుని యందు వారికున్న నమ్మకంతో ఏదో విధంగా సతమతమవుతారు. ఈ కోర్సు విశ్వాసమును గూర్చి మాట్లాడిన వాక్యభాగములను స్పష్టమైన రీతిలో అర్ధం చేసుకొనుటకు సహాయపడుతుంది. మరియు దేవునికి ఇష్టమైన, బలమైన క్రైస్తవ జీవితంను జీవించుటకు సహాయపడుతుంది.
How To Build Your Faith
Dr. Joel Madasu is the instructor of this course. His desire is to help you be strong in your Christian faith and walk. He understands that many believers today struggle in their walk or compromise in their walk with Christ. This course is designed to help anyone struggling in this area.పాఠములను గూర్చిన పరిచయండా. జోయెల్ మాదాసు గారు ఈ కోర్సు బోధించువారుగా వున్నారు. మీ యొక్క క్రైస్తవ విశ్వాసములో మరియు నడకలో మీరు పరిపూర్ణులవుటకు వారియొక్క ఆశ మీకు సహాయపడుతుంది. ఈ రోజున అనేకమంది విశ్వాసులు వారి యొక్క విశ్వాసపు నడకలోను లేక క్రీస్తుతో నడచుటలో వారు రాజీ పడుతున్నారని వీరు అర్ధం చేసుకున్నారు. ఈ విధముగా ఎవరైతే సతమతమవుతున్నారో వారినుద్దేశించి ఈ కోర్సు తయారు చేయబడింది.
“For I want you to know, brothers and sisters, that the gospel preached by me is not of human origin. For I did not receive it from a human source and I was not taught it, but it came by a revelation of Jesus Christ” - Gal. 1:11-12.The gospel means, the good news. But it is more than a good news! It is the good news about Salvation in Jesus Christ, the Savior of mankind. In the ancient world, the term “gospel” is used to proclaim victorious news about battles. Later that term was used not only for announcing or proclaiming a victory of a battle or an event, but about Christ’s birth, His sacrifice to offer salvation to all those who believe in Him, through His death, burial and resurrection. So then, what is Gospel? Gospel is the good news about salvation through Jesus Christ from God. So anyone who believes in Him will not perish but have an everlasting life.సువార్త అనుదాని గురించి తెలుసుకోండి.“సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలు పరచుటవలననే అది నాకు లభించింది ” గలతి 1:11-12సువార్త అనగా, మంచి వార్త. అయితే మంచి వార్త అనే దానికి మించిన అర్థం వుంది. యేసుక్రీస్తు నందు కలిగే రక్షణ, మానవాళి యొక్క రక్షకుని గూర్చిన మంచి వార్త ఇది.ప్రాచీన ప్రపంచములో “సువార్త “అనే పదము యుద్ధములలో సాధించిన విజయాలను గూర్చిన వార్తలను ప్రకటించుటకు వాడేవారు. తరువాత కాలములో ఈ పదము కేవలం యుద్ధ సంబంధ విజయాన్ని గూర్చి లేక ఆ సంఘటన గూర్చి ప్రకటించుటకు మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క జననం, మరణం, పాతిపెట్టబడుట, పునరుత్థానం ద్వారా తన యందు విశ్వాసముంచు వారందరికీ రక్షణ ఇవ్వడం కోసం ఆయన చేసిన త్యాగమును ప్రకటించుటకు వాడబడింది.కావున ఇప్పుడు, సువార్త అంటే ఏంటి? సువార్త అనగా దేవుని నుండి క్రీస్తు ద్వారా కలిగే రక్షణను గూర్చిన మంచి వార్త. కావున ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో, వారు నశింపక నిత్యజీవము పొందుకుంటారు.
When one believes in Christ, he or she gets a new identity. Faith in Christ brings a new or a better life as compared to the old life. In Ephesians 4:22-24 Paul says a similar thing about old lifestyle and the new lifestyle - “to put off your old self, which belongs to your former manner of life and is corrupt through deceitful desires, and to be renewed in the spirit of your minds, and to put on the new self, created after the likeness of God in true righteousness and holiness.”క్రీస్తు నందు నీ గుర్తింపును గురించి తెలుసుకోండి.ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసముంచుతాడో, అతడు లేక ఆమె ఒక నూతన గుర్తింపును పొందుకుంటారు.క్రీస్తునందు విశ్వాసం పాత జీవితంనకు మించిన క్రొత్త జీవితంను లేక శ్రేష్ఠమైన జీవితంను తీసుకునివస్తుంది.ఎఫెసీ 4:22-24లో పౌలు పాత జీవన విధానము మరియు నూతన జీవన విధానమును గూర్చి చెప్తున్నాడు. “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడినవారై, నీతియు యదార్ధమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను”
Christian life is not as easy as some say. This is not to say that becoming or being a Christian is not worth our time. It is! There is no other religion that gives us the promise of eternal life, but Christianity alone. Christ never promised an easy life. In fact, He said that whosoever would believe in Him would be persecuted by the world. That is because the world already hated Him. This lesson is created to help you see the "reality" of what we might face because of our faith in Christ, and also the everlasting promise that we have in Christ. క్రైస్తవ జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకోండి.కొందరు చెప్పినట్లుగా క్రైస్తవ జీవితం సులభమైనది కాదు. క్రైస్తవునిగా మార్చబడడం లేక క్రైస్తవునిగా ఉండటం మన కాలములో పనికిరానిది అని చెప్పుటకు కాదు ఇది. ఏ మతము కూడా నిత్య జీవమును గూర్చిన వాగ్దానమును ఇవ్వలేదు కానీ క్రైస్తవ్యము మాత్రమే ఇచ్చింది అని చెప్పుటకు ఇది.సులభమైన జీవితం గూర్చి ప్రభువు ఎన్నడూ వాగ్దానము చేయలేదు. నిజానికి, ఆయన యందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారు లోకముచేత ద్వేషించబడతారు అని ఆయన చెప్పాడు. ఎందుకంటే లోకము ఆయనను ముందుగానే ద్వేషించింది కాబట్టి.ఈ పాఠము క్రీస్తునందు మనకున్న విశ్వాసమును బట్టి మనము ఏమి ఎదుర్కొనబోతామో మరియు క్రీస్తునందు మనకున్న నిత్యజీవమును గూర్చిన వాగ్దానము యొక్క “వాస్తవికత “చూచుటకు సహాయపడేలా తయారు చేయబడింది.
A simple way of saying this is: Christ used comparative terms to indicate and pinpoint those who either have great faith or weak faith. Faith is not a sort of pill that we take and have it consistent throughout our lives. It is something that we need to work on. When we know and understand who our object of faith is, then we would work genuinely towards growing in faith.We also need to grow in faith because all over the world there are Christians who struggle in their walk with Jesus Christ. The reason for this is we are doubting Him. We doubt Him because of several reasons; whatever those reasons might be, we can still strive to live a life that we will not doubt Him; thus giving Him all glory.ఎందుకు విశ్వాసములో ఎదగడం మనకు అవసరం?ఈ విషయాన్నీ చెప్పే సామాన్యమైన మార్గం ఇది. ఎవరైతే బలమైన విశ్వాసము మరియు బలహీనమైన విశ్వాసమును కలిగి వున్నారో వారిని సూచించడానికి మరియు వారి యొక్క సరైన స్థానాన్ని గూర్చి చెప్పడానికి పోలికలతో కూడిన పదములను క్రీస్తు ఉపయోగించాడు. మన జీవితమంతటిలో స్థిరమైన రీతిలో విశ్వాసమును కలిగి ఉండుటకు విశ్వాసము అనేది అనారోగ్యానికి వేసుకునే మాత్ర లాంటిది కాదు. ఇది క్రియాత్మకమైనది. మన విశ్వాసమునకు కర్త ఎవరో మనం తెలుసుకుని, అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు విశ్వాసములో ఎదుగుటకు మనము న్యాయబద్ధముగా పనిచేస్తాము.మరియు విశ్వాసములో ఎదుగుట మనకు అవసరం. ఎందుకంటే ప్రపంచమంతటా యేసుక్రీస్తు తో నడుచుటకు సతమతమవుతున్న క్రైస్తవులు ఎంతోమంది వున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం ఆయన్ను సందేహిస్తున్నాం. మనము ఆయన్ను సందేహించుటకు పలు రకాల కారణాలు వున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ఆయన్ను సందేహించని జీవితాన్ని జీవించుటకు మనం ప్రయాసపడాలి. అది ఆయనకు మహిమను తీసుకువస్తుంది.
Follow these steps that would help you grow in your Faith and become stronger so you will not doubt God or His ability.Know that Faith is much more than just believing. It is our reliance in God that He is able to do anything He wishes to do according to His Will.Faith has to do with "knowledge." Knowledge that we receive from the Scripture.విశ్వాసములో ఎలా ఎదగగలము?ఈ క్రింద వున్న అంశాలను పాటించండి అవి మీరు విశ్వాసములో ఎదుగుటకు మరియు బలపడుటకు సహాయపడతాయి. ఫలితంగా దేవున్ని మరియు ఆయన శక్తికి మీరు సందేహించరు.కేవలం నమ్మకముంచడం అనే దానికి మించినది విశ్వాసం అని తెలుసుకోండి. తన చిత్తప్రకారం, తాను అనుకున్న దానిని ఆయన చేయుటకు సమర్థుడు అని దేవుని యందు మనం ఆధారపడటం.విశ్వాసము అనేది “జ్ఞానము”తో ముడిపడి వుంది. ఈ జ్ఞానాన్ని మనము లేఖనములలో నుండి పొందుకోగలము.
Have daily communion with God by doing devotions and meditating on His Word.Make time for God.Continue to pray as much as possible.Dedicate yourselves to His service.Be with people who talk and share God's Word and His wisdom to you.Reject any negative thoughts about God.Reject any negative teachings about Christ. Acknowledge that you are a child of God and nothing can separate you from His love.విశ్వాసములో బలముగా నిలిచి ఉండుటకు నేనేమి చేయాలి?లేఖనమును ధ్యానించుట ద్వారా మరియు ఆరాధనలు చేయుట ద్వారా దేవునితో అనుదినము సహవాసమును కలిగి వుండండి.దేవుని కోసం సమయాన్ని కేటాయించండి.సాధ్యమైనంత వరకు ఎడతెగక ప్రార్థన చేయండి.ఆయన పరిచర్య కొరకు మిమ్మును మీరు ప్రతిష్టించుకోండి.దేవుని వాక్యాన్ని మరియు ఆయన జ్ఞానాన్ని ప్రకటించేవారితోను, మరియు సంబాషించేవారితోను సహవాసాన్ని కలిగి వుండండి.దేవుని గూర్చిన వ్యతిరేక ఆలోచనలను తిరస్కరించండి.క్రీస్తును గూర్చిన వ్యతిరేక బోధలను తిరస్కరించండి.నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు అని మరియు ఆయన ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయలేదని గుర్తించండి.
I have started a podcast ministry in Telugu with the desire to reach Telugu people with the Word of God. If you like to listen to it, please subscribe on iTunes or Podbean.అదనములు.ఈ కోర్సు క్రమములో, మీరు పాలిభాగస్తులుగా ఉండుటకు ఇష్టపడినట్లైతే మీరు చేయవలసిన కొన్ని అదనపు కార్యక్రమంలు వున్నాయి.Podcast ను ద్రువీకరించండి (subscribe).దేవుని వాక్యంతో తెలుగు ప్రజలకు దగ్గరవాలనే ఆశక్తితో అంకతాత్మక శ్రవ్య శ్రేణి (podcast) పరిచర్యను నేను తెలుగు లో ప్రారంబించాను. మీరు దానిని వినడానికి ఇష్టపడినట్లైతే దయచేసి itunes లేక podbean ను ద్రువీకరించండి (subcribe).
Please let me know what you think about this course, and if this course is helpful to you. I will appreciate your valuable time. మీ అభిప్రాయాలు వ్రాయండి.ఈ కోర్సు పట్ల మీరు ఏమి ఆలోచిస్తున్నారు మరియు ఏ విధముగా ఈ కోర్సు మీకు సహాయపడగలదో నాకు తెలియచేయండి. మీ యొక్క విలువైన సమయాన్ని నేను అభినందిస్తాను.
About Joel Madasu
Dr. Joel Madasu has a PHD in Biblical Studies, Old Testament Concentration. He enjoys reading Bible, creating courses and teaching! He is the President of the Gospel Heritage Ministries Inc. He also runs a blog at https://joelmadasu.com; A podcast at https://www.bibleprabodhalu.com and https://www.theplainsense.com.