Skip to content

The Gospel, Plainly

What the good news actually says, and how to say it to someone else without losing it in translation.

సువార్త నిజంగా ఏమి చెబుతుందో, దానిని మరొకరికి అర్థం కోల్పోకుండా ఎలా చెప్పాలో.

What the Good News Actually Says

The gospel is an announcement, not an assignment. It tells us what God has already done in Jesus Christ. It does not hand us a list of things to achieve in order to earn God’s favor.

At its center is a short, public message: Christ died for our sins, He was buried, and He was raised on the third day, all according to the Scriptures (1 Corinthians 15:3–5). Everything else we say about who Jesus is, why His death matters, and what lies ahead grows out of this message.

సువార్త నిజంగా ఏమి చెబుతుంది

సువార్త ఒక ప్రకటన, ఒక పని అప్పగింత కాదు. యేసుక్రీస్తులో దేవుడు ఇప్పటికే చేసినదానిని అది తెలియజేస్తుంది. దేవుని దయ సంపాదించుకోవడానికి మనం చేయవలసిన పనుల జాబితాను అది ఇవ్వదు.

దాని కేంద్రంలో ఒక చిన్న, బహిరంగ సందేశం ఉంది: క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచాడు (1 కొరింథీయులకు 15:3–5). యేసు ఎవరు, ఆయన మరణం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తులో ఏమి ఉంది అనే మిగతా బోధంతా ఈ సందేశం నుండే వస్తుంది.

Why It Was Ever Needed

God made us, and He is holy and good. Sin has separated every one of us from Him, and its wage is death. We cannot repair that break by our own effort. We needed someone to do for us what we could not do for ourselves.

ఇది ఎందుకు అవసరమైంది

దేవుడు మనలను సృష్టించాడు; ఆయన పరిశుద్ధుడు, మంచివాడు. పాపము ప్రతి ఒక్కరినీ ఆయన నుండి వేరు చేసింది, దాని జీతం మరణం. ఆ దూరాన్ని మన సొంత ప్రయత్నంతో సరిచేయలేము. మనం చేయలేనిదానిని మన కోసం చేయగలవాడు మనకు కావలసి వచ్చింది.

What Christ Actually Did

Jesus took our place. He paid the debt of our sin on the cross, and He rose again to show that the debt was paid in full.

The right response is faith and repentance together. “Believe in the Lord Jesus, and you will be saved” (Acts 16:31). Jesus Himself called people to “Repent and believe the good news!” (Mark 1:15; compare Acts 20:21). To repent is to turn away from sin. To believe is to trust Christ alone to save.

క్రీస్తు నిజంగా ఏమి చేశాడు

యేసు మన స్థానాన్ని తీసుకున్నాడు. సిలువపై మన పాపపు ఋణాన్ని చెల్లించాడు; ఆ ఋణం పూర్తిగా చెల్లించబడిందని చూపడానికి తిరిగి లేచాడు.

సరైన స్పందన విశ్వాసం, మారుమనస్సు రెండూ కలిసి ఉండటం. పాపం నుండి తిరగడమే మారుమనస్సు; రక్షించడానికి క్రీస్తును మాత్రమే నమ్ముకోవడమే విశ్వాసం. యేసు ప్రజలను మారుమనస్సు పొంది సువార్త నమ్మమని పిలిచాడు (మార్కు 1:15; అపొస్తలుల కార్యములు 20:21 కూడా చూడండి).

అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పిఅపొస్తలుల కార్యములు 16:31 (BSI)

Two Ways to Tell It

You can tell the gospel at full length, with the whole story from creation to the cross, or in one short breath when time is short. Both are the same message. The short form is not a different gospel; it is the same gospel made small enough to carry.

చెప్పడానికి రెండు మార్గాలు

సృష్టి నుండి సిలువ వరకు పూర్తి కథగా సువార్తను చెప్పవచ్చు; సమయం తక్కువగా ఉన్నప్పుడు ఒకే శ్వాసలో కూడా చెప్పవచ్చు. రెండూ ఒకే సందేశం. చిన్న రూపం వేరే సువార్త కాదు; మోసుకెళ్ళగలిగేంత చిన్నదిగా చేసిన అదే సువార్త.

How to Actually Do It

  • Start with relationship. People listen to those who care about them.
  • Use a tract or a short written outline when it helps you stay clear.
  • Tell your own story of how you came to trust Christ, in a few plain sentences.
  • Hold the outcome loosely. You are faithful to speak; God alone gives new life.
  • Pray before, during, and after.

దీనిని ఆచరణలో ఎలా చేయాలి

  • సంబంధంతో మొదలుపెట్టండి. తమను పట్టించుకునేవారి మాట ప్రజలు వింటారు.
  • స్పష్టంగా చెప్పడానికి సహాయపడితే చిన్న కరపత్రం లేదా రాత రూపంలో ఉన్న రూపరేఖను వాడండి.
  • మీరు క్రీస్తును ఎలా నమ్మారో మీ సాక్ష్యాన్ని కొన్ని సరళమైన వాక్యాలలో చెప్పండి.
  • ఫలితాన్ని దేవునికి వదిలేయండి. చెప్పడంలో నమ్మకంగా ఉండటం మీ పని; నూతన జీవితం ఇచ్చేవాడు దేవుడే.
  • ముందు, సమయంలో, తరువాత ప్రార్థించండి.

The Gospel in One Breath

సువార్త ఒకే శ్వాసలో

1

God

He made you, and He is holy and good.

Genesis 1:27; Psalm 100:3

దేవుడు

ఆయన నిన్ను సృష్టించాడు; ఆయన పరిశుద్ధుడు, మంచివాడు.

ఆదికాండము 1:27; కీర్తనలు 100:3
2

You

Sin has separated everyone from Him, and its wage is death.

Romans 3:23; Romans 6:23

నీవు

పాపము అందరినీ ఆయన నుండి వేరు చేసింది; దాని జీతం మరణం.

రోమీయులకు 3:23; 6:23
3

Christ

Jesus paid that debt on the cross and rose again to prove it was paid in full.

Romans 5:8; 1 Corinthians 15:3–4

క్రీస్తు

యేసు సిలువపై ఆ ఋణాన్ని చెల్లించి, అది పూర్తిగా చెల్లించబడిందని నిరూపించడానికి తిరిగి లేచాడు.

రోమీయులకు 5:8; 1 కొరింథీయులకు 15:3–4
4

Respond

Turn from sin, trust Him, and you will be saved.

Acts 16:31; Romans 10:9

స్పందించు

పాపం నుండి తిరిగి, ఆయనను నమ్ముకో; నీవు రక్షణ పొందుదువు.

అపొస్తలుల కార్యములు 16:31; రోమీయులకు 10:9

The Bottom Line

The gospel is good news because it is about what Christ has done, not what we must do to earn it. Turn from sin, trust Him, and you will be saved.

సారాంశం

సువార్త శుభవార్త, ఎందుకంటే అది క్రీస్తు చేసినదాని గురించి, మనం సంపాదించవలసినదాని గురించి కాదు. పాపం నుండి తిరిగి, ఆయనను నమ్ముకో; నీవు రక్షణ పొందుదువు.

Save to list

>