The Letter to Titus was most probably written during Paul’s trip to Rome (Acts 27).
He was not as close as Timothy was to Paul, but still Titus played a crucial role in Paul’s ministry, as well as in Crete. Titus was not mentioned in the book of Acts, but he was a part of Paul’s inner circle, and Paul referred to him in the letter to 2nd Corinthians.
Titus was referred by Paul as a “brother” (2 Cor. 2:13), and as a “partner” and “coworker” in 2 Cor. 8:23. Even though Titus was not mentioned in the book of Acts, he was referred repeatedly in 2 Corinthians (2 Cor. 2:12-13; 7:5-6; 8:6).
తీతు పత్రిక యొక్క ఉపోద్గాతము
''నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా నీవు లోపముగా వున్నా వాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే క్రేతులో నిను విడిచి వచ్చితిని.''
బహుశా రోమాకు ప్రయాణము చేసే సమయములో తీతుకు ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చును (అ. కా 27). తిమోతి వలె యితడు పౌలు కు సన్నిహితుడు కాదు, అయినప్పటికీ, పౌలు యొక్క పరిచర్యలో అదేవిధముగా క్రేతులో కూడా తీతు కీలకమైన పాత్ర పోషించాడు. తీతును గూర్చి అపొస్తలుల కార్యముల గ్రంధములో ప్రస్తావించబడలేదు. అయినప్పటికి పౌలు యొక్క అంతరంగిక వ్యక్తులలో యితడు ఒక పాలిభాగస్తుడిగా వున్నాడు మరియు 2వ కొరింథీ పత్రికలో పౌలు ఇతనిని గూర్చి ప్రస్తావించాడు.
తీతు ఒక ''సహోదరుడు'' గా (2వ కొరింథీ 2:12) మరియు పాలివాడుగా, జతపని వాడుగా 2వ కొరింథీ 8:23 లో పౌలు చేత ప్రస్తావించబడ్డాడు. అపొస్తలుల కార్యముల గ్రంధములో తీతు ప్రస్తావించబడకపోయినప్పటికీ, 2 వ కొరింథీ పత్రికలో యితడు తరచుగా ప్రస్తవించబడ్డాడు (2వ కొరింథీ 2:12 - 13, 7:5 -6, 8:6)
ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తము తిమోతి వలెనె తీతు కూడా క్రేతు లో విడిచి పెట్టబడ్డాడు (1:5 - ''నీవు లోపముగా వున్నా వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని''). ఈ పత్రికను అందుకున్న తరువాత, తనకప్పగింపబడిన పనిని చేసిన తరువాత తీతు పౌలు దగ్గరకు వెళ్ళవలసి వుంది (3:12 - నికొపొలిలో శీతాకాలం గడపాలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము).
తీతు క్రేతులో ఉండటం గల ఉద్దేశం 1:10 - 14 వచనాలలో ప్రస్తావించబడింది.
''అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులను మోసపుచ్చువారునై యున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను - క్రేతీయులు ఎల్లపుడు అబద్ధికులును, దుష్ట మృగములను, సోమరులగు తిండిపోతులునై యున్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కధలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్ధింపుము."
ఈ పాఠ్యభాగము ఆధారముగా, తీతు క్రేతులో గడిపే ఉద్దేశం ప్రాధమికంగా సున్నతి సంబందులను (యూదులు అని అర్ధం) గద్దించుట అనే బాధ్యత, తదుపరి, సంఘములో పెద్దలను మరియు అధ్యక్షులను నియమించుటకు పౌలు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చాడు.
తిమోతి మరియు తీతుకు మధ్య వున్న గమనించదగ్గ వ్యత్యాసము ఏమనగా, ముందుగా స్థాపించబడిన సంఘానికి ఉపదేశించే నిమిత్తం లేక ఆజ్ఞాపించే నిమిత్తము, ఎఫెసులో నిలిచి యుండుమని తిమోతి హెచ్చరించబడ్డాడు. అలాగే ఇంకా పూర్తిగా స్థాపించబడని సంఘం కొరకు, మరియు ఇతర పట్టణాలలో పెద్దలను ''నియమించు'' నిమిత్తం క్రేతులో నిలిచి ఉండాలని తీతు పౌలు చేత హెచ్చరించబడ్డాడు.
ఈ సమాచారం తెలియపరచేదేమంటే, క్రేతులో వున్న సంఘాలు నూతనముగా స్థాపించబడ్డాయి మరియు వాటికీ సరైన వ్యవస్థాగత నిర్మాణం లేదు. (వ్యవస్థాగత ఆకారానికి ఒక ఉద్దేశం ఉందని గమనించండి 1:9). కావున తీతును ఎందుకు క్రేతులో వదిలి పెట్టాడో కారణాన్ని పౌలు స్పష్టముగా తెలియచేసిన తరువాత సంఘ పెద్దలను, అధ్యక్షులను నియమించుటకు సూచనలు ఇస్తూ వచ్చాడు.
- అబద్ద బోధను గద్దించుటకు, మరియు
- పెద్దలను, అధ్యక్షులను నియమించుటకు (1:6, 7)
ఈ నూతన సహవాసములో వున్న ''అవిధేయులను'' గద్దించుట తీరుతూ యొక్క బాధ్యత అయినప్పటికి హితబోధను విభేదించేవారిని గద్దించే బాధ్యత మరియు జనులను హెచ్చరించే బాధ్యత పెద్దలకు మరియు అధ్యక్షులకు ఇవ్వబడినది. (1:9 - తానూ హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకు శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మడిగిన బోధను గట్టిగ చేపట్టుకొనువాడునై యుండవలెను).
గద్దించుట అనేది ప్రాథమిక అంశం అయినప్పటికీ తీతు యొక్క ఉద్దేశం కేవలం అది మాత్రమే కాదు మరియు ప్రజలు ''సత్క్రియలు యందు మనస్సు ఉంచేలా'' చేయడం కూడా (3:8 - ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్దగా చేయుట యందు మనస్సునుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు ప్రయోజనకరమునై యున్నవి).
ఇక్కడ పౌలు చెప్పినదానికి అర్ధం ఏమనగా, విశ్వాసలు ఖచ్చితముగా మాదిరికరమైన క్రైస్తవ ప్రవర్తన కలిగియుండాలి. తద్వారా బటయట వున్నవారు నిజమైన క్రైస్తవ జీవితాన్ని చూడగలరు.
Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.
విశ్వాసలు ఖచ్చితముగా మాదిరికరమైన క్రైస్తవ ప్రవర్తన కలిగియుండాలి.